‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో యువ హీరో నితిన్ ‘భీష్మ’ అనే చిత్రంలో నటించనున్నాడని తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జర్పుకుంటున్న ఈచిత్రం వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలోసెట్స్ మీదకు వెళ్లనుంది. కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈచిత్రంలో నితిన్ కొత్త లుక్ లో కనిపించనున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై నాగ వంశీ నిర్మించనున్న ఈ చిత్రంలో నితీన్ కు జోడిగా రష్మిక మందన్న నటించనుంది.
ఇక ‘అ ఆ’ సినిమా తరువాత నితిన్ చేసిన సినిమాలు అనుకున్నంతగా విజయాన్ని సాదించలేకపోవడంతో ఆయన ఈ చిత్రం ఫై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. మరి నితిన్ ఈచిత్రం తో సూపర్ హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.


