నాని సినిమాలో సీనియర్ హీరోయిన్ !
Published on Jun 17, 2017 12:41 pm IST


వరుస సినిమాలతో దూసుకుపోతున్న నాని ప్రస్తుతం నిన్నుకోరి చిత్రంలో నటిస్తున్నాడు. ఆ చిత్ర ట్రైలర్ కొద్ది సేపటిక్రితమే విడుదలయింది. కాగా నాని తదుపరి నటించే సినిమా విషయంలో ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. వేణుశ్రీరాం దర్శకత్వంలో నాని నటించనున్నాడు. ఆ చిత్రానికి ‘ఎమ్ సి ఏ’ అనే టైటిల్ ఖరారైన విషయం తెలిసిందే. మిడిల్ క్లాస్ అబ్బాయి అనేది క్యాప్షన్.

కాగా ఈ చిత్రంలో ఓ సీనియర్ హీరోయిన్ కీలక పాత్ర పోషించనుందనే న్యూస్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. భూమిక ఈ చిత్రంలో కీ రోల్ ప్లే చేయనుందట. భూమికతో పాటు ఆమని కూడా ఈ చిత్రంలో నటించనుంది. యంగ్ బ్యూటీ సాయి పల్లవి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఎమ్ సి ఏ చిత్రంలో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభం అయింది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

 
Like us on Facebook