అలాంటి వ్యక్తుల పై ఫిర్యాదు చేయండి – భూమి పెడ్నేకర్‌

Published on May 24, 2021 4:01 pm IST

కరోనా విలయతాండవం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ప్రజలు కరోనా బారిన పడి సరైన వైద్యం అందక అల్లాడిపోతున్నారు. బాలీవుడ్‌ హీరోయిన్ భూమి పెడ్నేకర్‌ ఈ కరోనా కష్ట కాలంలో కొవిడ్‌ బాధితులను ఆదుకునేందుకు మన వంతు కృష్టి చేయాలని సోషల్ మీడియా వేదిక ద్వారా ఫాలోవర్స్ ను కోరుతుంది. ఆమె మాటల్లోనే ‘‘నా ఫ్యామిలీ ఈ భయంకరమైన వైరస్‌తో పోరాడింది. నా తల్లి కరోనా సోకిన సమయంలో పడిన కష్టాన్ని నేను చూశాను. అప్పుడే నేను సాధ్యమైనంత మందికి సహాయపడాలని నిర్ణయించుకున్నాను.

ప్రస్తుతం మేము 200మంది వలంటీర్ల సాయంతో నాకు చేతనైన సాయం అందిస్తున్నాము. అయితే అవసరార్థులకు సాయమందించే క్రమంలో దోపిడీకి కూడా గురికావాల్సి వస్తోంది. మన చేసే సహాయం సరైన వ్యక్తులకు చేరుతుందా? లేదా? అని చూసుకోవాలి. కొన్ని చోట్ల ఆక్సిజన్‌ సిలిండర్లు, ఇతర మెడిషన్స్ పక్కదారి పడుతున్నాయి. కాబట్టి పక్కదారి పట్టిస్తోన్న తప్పుడు వ్యక్తుల గురించి తెలిస్తే.. పోలీసులకు రిపోర్ట్‌ చేయండి. అంటూ భూమి కోరింది.

సంబంధిత సమాచారం :