పూరి జగన్నాధ్ కి అమితాబ్ రెకమండేషన్

పూరి జగన్నాధ్ కి అమితాబ్ రెకమండేషన్

Published on May 19, 2015 8:35 PM IST

Amitabh-Bachchan
సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క హీరో, హీరోయిన్, డైరెక్టర్, యాక్టర్స్, టెక్నీషియన్స్ అందరికీ కచ్చితంగా ఓ డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ నిజమయ్యిందంటే వారి ఆందానికి అవధులు ఉండవు. అలాంటి మోస్ట్ వాంటెడ్ డ్రీమ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కెరీర్ లో నిజమైంది. అదే మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం రావడం. చిరు సినిమాలకు కటౌట్ లు కడుతూ మెగాస్టార్ పై తన అభిమానాన్ని చాటుకున్న పూరి ఆ తర్వాత డైరెక్టర్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసాడు. ఫైనల్ గా ఇన్ని రోజులకి మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ పూరికి వచ్చింది.

ఈ అవకాశానికి ప్రధాన కారణం బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అని పూరి అంటున్నాడు. అసలు విషయంలోకి వెళితే ‘బుడ్డా హోగా తేరా బాప్ సినిమా ప్రీమియర్ టైములో అమితాబ్ బచ్చన్ చిరంజీవిగారిని మీరు మళ్ళీ సినిమాల్లోకి రావాలి, మీ 150వ సినిమాకి పూరి ని డైరెక్టర్ గా పెట్టుకోవాలని చెప్పాడు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో బిజీ అయ్యారు. ఇటీవలే చిరు గారు కాల్ చేసి ఆఫీస్ కి రమ్మన్నారు. వెళితే అక్కడ ఓ షీట్లో టాలీవుడ్ లోని ప్రముఖ డైరెక్టర్స్ లిస్టు ఉంది. ఆ లిస్టులో నా పేరుని హైలైట్ చేసి ఉన్నారు. అయన నువ్వే నా 150వ మూవీకి డైరెక్టర్ అని చెప్పడంతో. నాకు నోట మాట రాలేదు. వెంటనే ఆయన్ని గట్టిగా కౌగలించుకున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీ. అభిమానుల అంచనాలను అందుకునేలా చిరు 150వ సినిమా చేస్తానని’ పూరి జగన్నాధ్ తెలిపాడు.

చిరు బర్త్ డే కానుకగా ఆగష్టు 22న మూవీని అధికారికంగా లాంచ్ చేసి, వెంటనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మించనున్నాడు.

తాజా వార్తలు