బిగ్ బాస్ పేరిట రికార్డులే రికార్డులు

Published on Aug 2, 2019 9:20 am IST

బిగ్ బాస్ షో కి తెలుగు రాష్ట్రాలలో దక్కుతున్న ఆదరణ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా జులై 21న ఘనంగా ప్రారంభమైన బిగ్ బాస్ 3 రికార్డులు సృష్టిస్తుంది. ఈ షోకి వస్తున్న టీఆర్పీ రేటింగ్స్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ కావలసిందే. ఈ షో క్రియేట్ చేసిన రికార్డ్స్ పై స్టార్ మా ఓ పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది.

60% బుల్లితెర ప్రేక్షకులు ఈ షోని చూస్తున్నారట. అంటే బిగ్ బాస్ ప్రసార సమయంలో ప్రతి వందమందితో 60 మంది బిగ్ బాస్ చూస్తుంటే మిగతా 40మంది ఇతర చానెల్స్ లో వస్తున్న కార్యక్రమాలను వీక్షిస్తున్నారన్నమాట. అలాగే బిగ్ బాస్3 ప్రారంభ ఎపిసోడ్ కి ఏకంగా 17.9 టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ దక్కగా, హైదరాబాద్ లో ఇది 19. 7 గా ఉంది. అలాగే 44% స్లాట్ షేర్ దక్కించుకోవడంతో పాటు, ఏకంగా 4.5కోట్ల ప్రేక్షకులు ఈ ప్రోగ్రాం కి ట్యూన్ అయ్యి వుంటున్నారట. మొత్తంగా 1108 గ్రాస్ రేటింగ్ పాయింట్స్ తో అతిపెద్ద విజయం వైపుగా పరిగెడుతుంది.

అనేక లైంగిక ఆరోపణలు,వివాదాలతో అసలు షో ప్రారంభమోవుతుందో లేదో అన్న తరుణంలో మొదలైన బిగ్ బాస్ 3 రియాలిటీ షో ఇంత పెద్ద విజయం సాధించడం ఆశ్చర్యకర విషయమే. ఇక మునుముందు ఎన్ని సంచలనాలు సృస్టించనుందో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :