బిగ్ బాస్ పారితోషికం కొరకు నటి ఆవేదన

Published on Aug 23, 2019 12:06 pm IST

ఈ మధ్య తమిళ బిగ్ బాస్ హౌస్ లో చిత్ర పరిశ్రమకు చెందిన నటి మధుమిత ఆత్మ హత్యకు ప్రయత్నించి పెద్ద సంచలనానికి తెరలేపింది. దీనితో షాక్ తిన్న విజయ్ టివి యాజమాన్యం ఆమెను వెంటనే హౌస్ నుండి బయటకు పంపించడం జరిగింది. ఐతే ఆ వివాదం అంతటితో ముగిసిందన్న తరుణంలో విజయ్ టివి యాజమాన్యం ఆమెపై కేసుపెట్టడంతో ఈ వివాదం మరో మలుపు తిరిగింది.

ఐతే ఈ విషయంలో మధుమిత మాత్రం విజయ్ టీవీ యాజమాన్యం నాకు ఇవ్వవలసిన పారితోషికం ఇవ్వకపోగా, నాపై కేసు పెట్టారని, ఈ విషయంలో కమల్ హాసన్ జోక్యం చేసుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐతే బిగ్ బాస్, మధుమితల వివాదం ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చే మార్గం కనపడటం లేదు. తెలుగు కంటే ముందే మొదలైన తమిళ బిగ్ బాస్ షో విజయవంతంగా నడుస్తుంది. హీరో కమల్ హాసన్ వరుసగా మూడో సీజన్ కి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :