బిగ్ బాస్ కపుల్ లేటెస్ట్ లుక్ కేక

Published on Nov 10, 2019 2:41 pm IST

వివాదాలతో మొదలైన బిగ్ బాస్ తెలుగు షో ఉత్కంఠ మధ్య విజయవంతంగా ముగిసింది. అండర్ డాగ్ గా ఎంటరైన సింగర్ రాహుల్ టైటిల్ విన్నర్ గా నిలిచి సంచలనం సృష్టించాడు. హాట్ ఫేవరెట్స్ లో ఒకరిగా ఉన్న యాంకర్ శ్రీముఖితో పోటీపడి రాహుల్ విన్నర్ గా నిలిచాడు. కాగా ఈ సీజన్లో ఒక ప్రత్యేకత చోటు చేసుకుంది. స్టార్ కపుల్ అయిన వితిక మరియు వరుణ్ కంటెస్టెంట్స్ గా హౌస్ లోకి ప్రవేశించారు. భార్య భర్తలు తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొనడం ఇదే మొదటిసారి కావడంతో ఈ జంటపై ప్రేక్షకులలో ఆసక్తిపెరిగింది.

వరుణ్ ఒకప్పటి యూత్ ఫుల్ హీరో కావడంతో ఈ సారి టైటిల్ ఆయనదే అని అందరూ భావించారు. ఈ భార్య భర్తల బంధం కెమెరాల మధ్య కొంత మేర సొంత ఇంటిలో వలే నడించింది. వీరి మధ్య ప్రేమ, కోపం, అసహనం వంటి అనేక ఎమోషన్స్ నడిచాయి. ఏదిఏమైనా ఈ కపుల్ చాలా రోజులు బిగ్ బాస్ షోలో విజయవంతంగా కొనసాగారు. తాజాగా వరుణ్ వితిక లు స్టైలిష్ లుక్ లో ఫోటో షూట్ చేశారు. వాటిలో ఒక ఫోటోని వరుణ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసుకొని భార్యను ఉద్దేశిస్తూ ‘ఆకర్షించే తుఫాను’ అని కామెంట్ పెట్టాడు. వీరిద్దరి లేటెస్ట్ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

సంబంధిత సమాచారం :