ఎన్టీఆర్ ని త్రివిక్రమ్ ఆ రేంజ్ లో చూపించగలడా..?

Published on Jul 10, 2020 7:30 am IST

ఎన్టీఆర్ తన 30వ చిత్రం దర్శకుడు త్రివిక్రమ్ తో ప్రకటించగా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే ఈ
మూవీ షూటింగ్ మొదలుకావాల్సి ఉండగా కరోనా వైరస్ కారణంగా బ్రేక్ పడింది. ఎన్టీఆర్ ఇమేజ్ కి తగ్గట్టుగా త్రివిక్రమ్ మార్క్ స్క్రిప్ట్ సిద్ధం చేసి ఉంచారు. ఐతే ఆర్ ఆర్ ఆర్ తరువాత విడుదల కానున్న ఈ సినిమా ఎన్టీఆర్ హీరోయిజంని మరింత ఎలివేట్ చేసేదిగా ఉండాలి. లేదంటే ఎంత బాగున్నా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంచనాలు అందుకోవడం కష్టం.

గతంలో కూడా రాజమౌళి స్థాయి ఎలివేషన్స్, హీరోయిజం అందుకోలేక అనేక మంది డైరెక్టర్స్ ఆ హీరోలకు ప్లాప్స్ ఇచ్చారు. మరి రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ పాత్ర పతాక స్థాయిలో ఉంటుందని తెలుస్తుండగా…ఆ తర్వాత ఆయన నుండి వస్తున్న మూవీలో ఎన్టీఆర్ నుండి ఫ్యాన్స్ ఆశించే రేంజ్ లో పాత్ర రూపిందించడం సవాలే అన్న మాట వినిపిస్తుంది. మరి ఆ ఛాలెంజ్ ని త్రివిక్రమ్ ఎలా అధిగమిస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :