ఏపీలో ‘అఖండ 2’ టికెట్ రేట్స్ పై ఊరట..!

ఏపీలో ‘అఖండ 2’ టికెట్ రేట్స్ పై ఊరట..!

Published on Dec 17, 2025 7:00 AM IST

akhanda 2

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా సంయుక్త హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “అఖండ 2”. మంచి హైప్ నడుమ వచ్చిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ ని సాధించి అదరగొట్టింది. సాలిడ్ ప్రీమియర్స్ ఇంకా టికెట్ ధరల హైక్స్ తో వచ్చిన ఈ సినిమా తెలంగాణాలో మొదటి వారాంతం తర్వాతే సాధారణ టికెట్ ధరలకు వచ్చింది.

ఇక ఏపీలో కూడా ఇవాళ్టి నుంచి సాధారణ టికెట్ ధరలు మేకర్స్ అమలు చేసేసారు. సో ఇది ఏపీలో ఆడియెన్స్ కి మంచి ఊరటనిచ్చే అంశం అని చెప్పి తీరాలి. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ అఖండ వసూళ్లు మంచి జంప్ అందుకుంటాయా అనేది చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా హర్షాలీ మల్హోత్రా ఇంకా తరుణ్ ఖన్నా కీలక పాత్రల్లో నటించారు. అలాగే 14 రీల్స్ ప్లస్ వారు ఈ సినిమాకి నిర్మాణం వహించారు.

తాజా వార్తలు