ఆర్ఆర్ఆర్ ఏంటో చెప్పేస్తారట…!

Published on Nov 13, 2019 5:01 pm IST

రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ చిత్రం నుండి జనవరి 1న ఆసక్తికర అనౌన్స్మెంట్ రానుంది. రాజమౌళి ఈ చిత్రం ప్రకటించినప్పటి నుండి, సినీ అభిమానులు అసలు ఆర్ ఆర్ ఆర్ అంటే ఏమిటో, తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ టీం కొద్దిరోజుల క్రితం ఆర్ ఆర్ ఆర్ ని విస్తరిస్తూ మీకు నచ్చిన టైటిల్స్ పంపవలసిందిగా ఆడియన్స్ ని కోరడం జరిగింది. ఔత్సహికులైన అనేక మంది దేశవ్యాప్తంగా తమకు నచ్చిన టైటిల్స్ పంపారు.

ఐతే టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న తాజా వార్త ప్రకారం జనవరి 1న నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆర్ ఆర్ ఆర్ యొక్క పూర్తి టైటిల్ తో కూడిన పోస్టర్ విడుదల చేస్తారట. రాజమౌళి 2020సంవత్సరం మొదటిరోజు ఆర్ ఆర్ ఆర్ వెనుక వున్న అసలు కథ గుట్టు విప్పుతారట. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ మూవీ హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్స్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది జులై 30న ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల కానున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More