బిగ్ అప్ డేట్ : ‘ఆర్ఆర్ఆర్’ నుండి ఆలియా లుక్ !

Published on Mar 13, 2021 2:55 pm IST

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’లో క్రేజీ బ్యూటీ ఆలియా భట్ చరణ్ సరసన నటిస్తోన్న తెలిసిందే. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమా నుండి అలియా భట్ కి సంబంధించి ఒక స్పెషల్ అప్‌డేట్ ఏమిటంటే, ఈ చిత్రంలో ఆమె లుక్ మార్చి 15న ఉదయం 11 గంటలకు రివీల్ కాబోతుంది.

అన్నట్టు ఈ సినిమాలో సెకెండ్ హాఫ్ లో అజేయ్ దేవగన్ రోల్ వస్తోందట. ఎక్కువుగా ఎన్టీఆర్ కాంబినేషన్ లోనే ఆయన సీన్స్ ఉంటాయట. ఇక ఎన్టీఆర్ కి జోడీగా ఒలివియా మోరిస్ ను హీరోయిన్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. సుమారు రూ.400 కోట్ల వ్యయంతో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

‘బాహుబలి’ సిరీస్ అనంతరం రాజమౌళి నుండి చేస్తున్న ప్రాజెక్ట్ కావడం, పైగా ఇద్దరు స్టార్ హీరోలతో బాలీవుడ్ స్టార్స్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో అత్యున్నత భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :