‘బిగ్ బాస్’ బిగ్ టాస్క్.. ఎవరు గెలుస్తారో ?

Published on Aug 1, 2019 7:42 pm IST

తెలుగు బుల్లితెర పై ప్రేక్షకులు విశేషంగా ఆకట్టుకుంటున్న షో ‘బిగ్ బాస్’. ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన ‘బిగ్ బాస్ 1’ బుల్లి స్క్రీన్ పై ఏ రేంజ్ లో ఉరూతలు ఊగించిందో ప్రత్యేకంగా చెప్పక్కనర్లేదు. ఈ సారి అక్కినేని నాగార్జున హోస్ట్ గా మొదలు అయిన ‘బిగ్ బాస్ 3’ మొదటి నుంచే కాస్త రసవత్తరంగా సాగుతుంది. కాగా ఈ రోజు బిగ్ బాస్ హౌస్‌మేట్స్‌ కి ఓ ఇంట్రస్టింగ్ టాస్క్ ఇచ్చాడు.

గార్డెన్‌ లో ఉన్న కిరీటాన్ని ఎవరు ఫస్ట్ పట్టుకుంటారో.. వారికి మిగతా సభ్యుల పై అధికారం చెలాయించే పవర్‌ వస్తుందని.. మొత్తానికి పవర్‌ గేమ్‌ అనే టాస్క్‌ ఇచ్చాడు బిగ్ బాస్. మరి ఈ టాస్క్‌లో ఎవరు గెలుస్తారో.. గెలుపు కోసం ఎవరు ఎవర్నీ తోసుకుంటూ వెళ్తారో చూడాలి. అయితే ఈ రోజు టాస్క్ లో ఖచ్చితంగా హౌస్‌మేట్స్‌ మధ్య గొడవలు జరిగేలా ఉన్నాయి. ఇలాంటి డిఫరెంట్ టాస్క్‌ లతో బిగ్ బాస్ రోజు రోజుకి షోను రసవత్తరంగా మారుస్తున్నాడు.

సంబంధిత సమాచారం :