ఈ కంటెస్టెంట్ ను సేవ్ చేయమంటున్న “బిగ్ బాస్ 3” విన్నర్.!

Published on Nov 25, 2020 8:00 am IST

ఉండేది కొద్ది కాలం అయినా సరే అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ను అందించే బిగ్గెస్ట్ రియాలిటీ షో “బిగ్ బాస్”. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయినటువంటి ఈ గ్రాండ్ రియాలిటీ షో మన తెలుగులో కూడా భారీ రెస్పాన్స్ ను అందుకొని ఒక్కో సీజన్ కు మంచి హైప్ తెచ్చుకుంటుంది.

అలాగే ఆ ఉన్న కొన్ని రోజులు కూడా సోషల్ మీడియాలో కూడా రచ్చ మామూలుగా ఉండదు. అలాగే ఇప్పుడు సీజన్ 4 కు కూడా గట్టిగానే ఉంది. అయితే ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు మిగిలి ఉన్న కొద్ది మందిలో నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ జోన్ లో ఉన్నారని తెలుసు.

వారిలో ఒకరికి సపోర్ట్ చేసి ఈ వారం సేవ్ చెయ్యాలని గత సీజన్ విన్నర్ అయినటువంటి రాహుల్ సిప్లిగంజ్ అంటున్నాడు. తన ఇన్స్టా ద్వారా మోనాల్ ఈ వారం కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే అని ఆమెకు అంతా ఓట్ చెయ్యాలని అంటున్నాడు. మరి మోనాల్ కు ఏకంగా గత సీజన్ విన్నర్ నుంచే సపోర్ట్ అందుకుంది మరి ఇక నుంచి ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More