బిగ్ బాస్ 4 – లాస్ట్ చేసి మేకర్స్ కు దెబ్బ పడుతుందట.?

Published on Dec 4, 2020 11:00 am IST

మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ సీజన్ 4 అంతిమ దశకు చేరుకుంటుంది. అయితే గడిచిన మూడు సీజన్లలో లేని విధంగా ఈ సీజన్ కు మొదటి నుంచే ఊహించని ఛాలెంజ్ లు మేకర్స్ కు ఎదురయ్యాయి. ఒక్క మొట్ట మొదటి ఎపిసోడ్ మినహా తర్వాత అంతా చాలా చప్పగా ఉండడంతో వెంటనే వైల్డ్ కార్డ్ ఎంట్రీలను కూడా దింపేశారు.

తర్వాత అలా మధ్యలో వీక్ ఎపిసోడ్స్ కు కూడా స్ట్రాంగ్ టీఆర్పీ ను కూడా అందుకున్నారు. కానీ ఇప్పుడు షో లాస్ట్ కు వస్తుండే సరికే సరైన రెస్పాన్స్ ను మేకర్స్ అందుకోలేకపోతున్నారట. ఈ వారం సహా గత వారపు వీక్ ఎపిసోడ్స్ కూడా ఏమంత చెప్పుకునే స్థాయి రేటింగ్ ను అందుకోలేదని తెలుస్తుంది. దీనితో ఇంకా ఫైనల్స్ కు రెండు వారాల సమయం మాత్రమే ఉన్నప్పుడే ఇలా తగ్గడం మేకర్స్ కు మళ్ళీ తలనొప్పిగా మారింది. దీనితో వీక్ ఎపిసోడ్స్ టైమింగ్ కూడా మారుస్తారని సమాచారం.

సంబంధిత సమాచారం :

More