బిగ్‌బాస్ 5కి వేరే లెవల్‌లో గ్లామర్ డోస్..!

Published on Jul 18, 2021 2:35 am IST

స్టార్ మాలో ప్రసారమయ్యే బిగ్‌బాస్‌ రియాలిటీ షో ఎంతో మంది ప్రేక్షక అభిమానులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని భారీ టీఆర్పీలను రాబట్టుకుంది. అయితే త్వరలోనే ప్రారంభం కాబోతున్న ఐదో సీజన్ గత నాలుగు సీజన్లకంటే మించి ఉండేలా నిర్వాహకులు ప్లాన్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రతి సీజన్‌లో గ్లామర్ డోస్‌కి ఎక్కువగా ప్రాధాన్యమిచ్చే నిర్వాహకులు ఈ సారి గ్లామర్ డోస్‌ను కాసింత గట్టిగానే తగలించబోతున్నారని తెలుస్తుంది.

అయితే ఈ సారి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న గ్లామర్ డోస్ ఇదే అంటూ కొందరి పేర్లు బయటకు వినిపిస్తున్నాయి. గ్లామరస్ యాంకర్ వర్షిణి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియ, బుల్లితెర ముద్దుగుమ్మ నవ్య స్వామి, హాట్ హీరోయిన్ ఈషా చావ్లా, పాటలతో మత్తెకించే సింగర్ మంగ్లీ, టీవీ9 ప్రత్యూష, యూట్యూబర్ అలియాస్ నటి సిరి ప్రియుడితో కలిసి, బుల్లితెర నటులు సిద్ధార్థ్ వర్మ-విష్ణుప్రియలు జంటగా ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ లిస్ట్‌లో ఉన్న వారిలో ఎవరెవరు హౌస్‌లోకి వస్తారో లేదో తెలీదు కానీ గ్లామర్ డోస్ మాత్రం ఈ సీజన్‌లో వేరే లెవల్‌లో ఉంటుందనేది ఖాయమన్న ప్రచారం మాత్రం గట్టిగా జరుగుతుంది.

సంబంధిత సమాచారం :