బిగ్‌బాస్-5: షణ్ముఖ్‌ రెమ్యునరేషన్ విన్నర్ కంటే ఎక్కువేనా?

Published on Dec 20, 2021 10:39 pm IST


బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్‌గా సన్నీ గెలుపొందగా, రన్నరప్‌గా యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌ నిలిచిన సంగతి తెలిసిందే. షణ్ముఖ్‌ గురుంచి మాట్లాడుకుంటే వెబ్‌సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ తో భారీగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయితే షో ప్రారంభంలో ఏదో హౌస్‌లో ఉన్నాడంటే ఉన్నాడన్న రిమార్క్ తెచ్చుకున్న షణ్ముఖ్‌ ఆ తర్వాత తనదైన గేమ్ స్ట్రాటజీని ఆడసాగాడు. చివరికి వచ్చేసరికి టైటిల్‌కి గట్టి పోటీ ఇచ్చినా కూడా విన్నర్‌గా నిలవలేకపోయాడు.

ఇదంతా పక్కన పెడితే షణ్ముఖ్‌ రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది. యాంకర్‌ రవి తర్వాత ఎక్కువ పారితోషికం అందుకున్న కంటెస్టెంట్‌గా షణ్ముఖ్‌ నిలిచాడట. అతనికి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని షో నిర్వాహకులు ఒక్క వారానికి గాను నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు ముట్టజెప్పారట. మొత్తంగా పదిహేను వారాలకుగానూ షణ్ముఖ్‌ రూ.65 లక్షల పైనే రెమ్యునరేషన్‌ తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఇది విన్నర్‌ ప్రైజ్‌మనీ కన్నా కూడా ఎక్కువేనట. మరీ ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :