కీలక పాత్రలో బిగ్ బాస్ ‘అఖిల్’ !

Published on Mar 13, 2021 6:08 pm IST

డైరెక్టర్ సంపత్‌ నంది డైరెక్షన్ లో గోపీచంద్‌ చేస్తోన్న తాజా సినిమా ‘సిటీమార్’లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ కనిపిస్తాడని.. సెకెండ్ హాఫ్ లో అఖిల్ క్యారెక్టర్ సినిమాలో ఎంటర్ అవుతుందని, సినిమాలోనే ఇది కీలక పాత్ర అని తెలుస్తోంది. ఈ స్పోర్ట్స్‌ బేస్డ్‌ మూవీలో మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

అన్నట్టు ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రాకి లీడ్‌ చేసే ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుండగా.. తమన్నా తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌గా నటిస్తోంది. వీరిద్దరి మధ్య నడిచే ట్రాక్ వెరీ ఇంట్రస్ట్ గా ఉంటుందట. ఇక ఈ సారి ఎలాగైనా గోపిచంద్ కి సూపర్ హిట్ ఇవ్వాలనే కసితో బాగా పట్టుదలగా ఉన్నాడు సంపత్ నంది. మరి ఈ సారి ఈ రేంజ్ హిట్ ఇస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :