బిగ్‌బాస్ ద్వారా బిందు మాధవి ఎంత సంపాదించిందో తెలుస్తే షాక్..!

Published on May 25, 2022 1:30 am IST

బిగ్‌బాస్‌ తెలుగు ఓటీటీ విజేతగా బిందు మాధవి నిలిచిన సంగతి తెలిసిందే. తెలుగులో ఆవకాయ బిర్యానీ, బంపర్‌ ఆఫర్‌ సినిమాల్లో నటించిన బిందు మాధవి తమిళ బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌లో కూడా పాల్గొంది. అయితే అక్కడ బిందు నాలుగో రన్నరప్‌గా నిలిచింది. ఇప్పుడు తెలుగులో ఏకంగా ట్రోఫీ అందుకుని బిగ్‌బాస్‌ కప్పు గెలిచిన మొట్టమొదటి మహిళా విజేతగా బిందు అవతరించింది. ఇదిలా ఉంటే అసలు బిగ్‌బాస్ ఓటీటీ ద్వారా బిందు మాధవి ఎంత సంపాదించిందో అన్న విషయం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది.

అయితే బిందు మాధవి షో విజేతగా నిలవడంతో రూ.40 లక్షలు దక్కాయి. వాస్తవానికి విన్నర్‌ ప్రైజ్‌మనీ రూ.50 లక్షలు కానీ గ్రాండ్‌ ఫినాలే రోజు బోల్డ్‌ బ్యూటీ అరియానా గ్లోరీ రూ.10 లక్షలు తీసుకుని రేసు నుంచి తప్పుకుంది. దీంతో ఆ పది లక్షలు ప్రైజ్‌మనీలో నుంచి కోత పెట్టారు. అలా బిందు చేతికి 40 లక్షల రూపాయలు వచ్చాయి. ఇకపోతే బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ షో 12 వారాలు సాగింది. అయితే ఆ 12 వారాలు హౌస్‌లో ఉన్నందుకు గాను ఆమెకు రూ. 55-60 లక్షలు వచ్చాయట. మొత్తంగా బిందు మాధవి ఇంచుమించు కోటి రూపాయలు గెల్చుకుందని, అందులో ట్యాక్స్ కటింగ్ పోయి దాదాపు రూ.90 లక్షల మేరకు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత సమాచారం :