బిగ్ బాస్ 5..ఈ కంటెస్టెంట్ కి జాగ్రత్త చెప్తున్న కౌషల్.!

Published on Sep 7, 2021 8:10 am IST

తెలుగు బుల్లితెర నాట అతి పెద్ద రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ మొన్ననే కొత్త సీజన్లో కి గ్రాండ్ గా అడుగు పెట్టింది. మరి ఇప్పటి వరకు నాలుగు సీజన్లని కంప్లీట్ చేసుకొని ఐదవ సీజన్లోకి అడుగు పెట్టిన ఈ గ్రాండ్ షోలో ఒక్కో సీజన్ కి ఒక్కో విన్నర్ తమదైన సెన్సేషన్ని సృష్టించారు. మరి వీరిలో బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ అయినటువంటి కౌషల్ మంద కూడా ఒకడు.

అసలు ఆ టైం లో యూనానిమస్ గా వార్ ని వన్ సైడ్ చేసేసి భారీ ఫాలోయింగ్ ని తెచ్చుకుని విణ్ణయ్యాడు. మరి ఆ తర్వాత నుంచి కూడా సీజన్లని ఫాలో అవుతున్న కౌషల్ ఇప్పుడు కొత్త సీజన్లో తన సపోర్ట్ ఎవరికి ఉంటుంది అన్నది క్లియర్ చేసాడు. తన సపోర్ట్ తనలా మోడల్ గా బిగ్ బాస్ హౌస్ పెట్టిన జశ్వంత్ జెస్సి కి ఉన్నట్టుగా తెలిపాడు.

తన ఇన్స్టా స్టోరీ ద్వారా తాను, అలీ రెజా తర్వాత బిగ్ బాస్ హౌస్ లో మోడలింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది నువ్వని, మోడల్స్ కన్నీళ్లు పెట్టకూడదు తమ యాటిట్యూడ్ లో ప్రేమని గెలుచుకోవాలి అన్నట్టుగా తెలిపాడు.. అంతే కాకుండా అలా ఏడిస్తే మొదటగా హౌస్ నుంచి ముందు నువ్వే బయటకి వచ్చేస్తావ్ సో జాగ్రత్తగా ఆడాలని ఆల్ ది బెస్ట్ చెప్పాడు. దీనితో కౌషల్ సపోర్ట్ ఇతనికి దక్కినట్టే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :