ఈసారి “బిగ్ బాస్ 5” అన్నీ ఐదింతలు..కిక్కు టన్నుల్లో

Published on Sep 5, 2021 11:00 am IST


ప్రపంచ ప్రపంచ బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో తన కొత్త సీజన్ లాంచ్ కి సిద్ధం అవుతుంది. మొత్తం నాలుగు సీజన్లను కంప్లీట్ చేసుకొని ఈరోజు చాలా గ్రాండ్ లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇప్పుడు మేకర్స్ ఈ సీజన్ ఓపెనింగ్ కొత్త ప్రోమోని లాంచ్ చేశారు. మరి ఈ ప్రోమోతో ఈసారి రచ్చ ఐదింతలు ఉంటుందని చెప్తున్నారు.

ఐదింతలు ఎంటర్టైన్మెంట్, ఎనర్జీ ఉంటాయని తెలుపుతున్నారు. అంతే కాకుండా ఈ సెట్ కూడా చాలా గ్రాండ్ గా కనిపిస్తుండగా హాట్ కింగ్ నాగ్ అల్ట్రా స్టైలిష్ ఎంట్రీ ఇచ్చారు. ఇంకా కొత్త బిగ్ బాస్ హౌస్ ని కూడా చూపించి నాగ్ తో ఈసారి కిక్ టన్నుల్లో ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. మరి ఈ గ్రాండ్ షో లాంచ్ ఎపిసోడ్ ఉంటుందో? కంటెస్టెంట్స్ ఎవెరెవరు ఉన్నారో తెలియాలి అంటే ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :