బిగ్‌బాస్-5 అన్ అఫీషియల్ ఓటింగ్.. విన్నర్ సన్నీ?

Published on Dec 18, 2021 10:10 pm IST


బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 తుది అంకానికి చేరుకుంది. రేపు జరగబోయే గ్రాండ్‌ ఫినాలే ఎపిసోడ్‌తో ఈ సీజన్‌ విన్నర్ ఎవరనేది తేలిపోనుంది. టైటిల్‌ రేసులో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్లలో సన్నీ, షణ్ముఖ్ మధ్య గట్టి పోటీ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే విన్నర్‌గా ఎవరు నిలుస్తారు అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న సమయంలో దీనిపై తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది.

ఇప్పటివరకు వచ్చిన ఓటింగ్ పర్సంటేజీల ప్రకారం సన్నీనే టాప్‌లో ఉన్నాడని, 34% ఓట్లతో సన్నీ విజేతగా నిలిచాడని వార్తలు వినిపిస్తున్నాయి. టైటిల్‌ రేసులో ఉన్న షణ్ముఖ్ 31% ఓట్లతో రెండో స్థానంలో ఉన్నాడని, 20% ఓట్లతో శ్రీరామ్‌ మూడవ స్థానంలో, 8% ఓట్లతో మానస్‌ నాలుగో స్థానంలో, 7% ఓట్లతో సిరి చివరలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇది అన్ అఫీషియల్ ఓటింగ్ మాత్రమె. అసలు విన్నర్ ఎవరనేది తెలియాలంటే రేపు జరగబోయే ఫినాలే వరకు ఎదురు చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :