బిగ్ బాస్ తెలుగు ఐదవ సీజన్ షూటింగ్ షురూ!?

Published on Aug 3, 2021 12:00 am IST

బుల్లితెర రియాలిటీ షో అయిన బిగ్ బాస్ సరికొత్తగా రూపుదిద్దుకుంటుంది. ఇప్పటికే సరికొత్త లోగో ను విడుదల చేసిన స్టార్ మా యాజమాన్యం, ఇప్పుడు సరికొత్త ప్లాన్స్ తో అయిదవ సీజన్ కొనసాగనుంది. అయితే ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించిన షూటింగ్ మొదలైనట్లు తెలుస్తోంది. అయితే ప్రోమో కి సంబంధించిన షూటింగ్ కూడా వేగం గా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే గత ఏడాది కరోనా వైరస్ మహమ్మారి కారణం గా కాస్త ఆలస్యం గా మొదలైన షో, ఈసారి మాత్రం అలా లేకుండా పక్కా ప్రణాళిక తో దూసుకు పోతున్నట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోలో ఇందుకు సంబంధించిన షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే కంటిస్టెంట్ల లిస్ట్ కూడా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. అయితే అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :