బిగ్‌బాస్ 5 కంటెస్టెంట్ నటరాజ్ మాస్టర్ బాలయ్యతో స్టెప్పులేయించాడా?

Published on Oct 26, 2021 1:59 am IST


నందమూరి బాలకృష్ణ ఓటీటీ వేదిక ఆహాలో ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ నిర్మాణంలో నవంబర్ 4వ తేది నుంచి ప్రసారం కానున్న ఈ షో మొత్తం 12 ఎపిసోడ్‌లుగా స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల ఈ టాక్ షో ప్రోమో చిత్రీకరణలో కూడా బాలకృష్ణ పాల్గొన్నాడు.

అయితే ఈ ప్రోమోలో బాలయ్య స్టెప్పులేయబోతున్నాడట. బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్‌బాస్‌’ సీజన్ 5లో ఐదో వారం ఎలిమినేట్ అయిన నటరాజ్ మాస్టర్ ప్రోమో కోసం బాలయ్యతో స్టెప్పులేయించాడని ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. బాలయ్యతో నటరాజ్ మాస్టర్ దిగిన ఫోటో ఈ వార్తలకు బలం చేకూర్చిందని చెప్పాలి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం అయితే రాలేదు.

సంబంధిత సమాచారం :