తమన్నాపై కోపంగా ఉన్న బిపాషా

తమన్నాపై కోపంగా ఉన్న బిపాషా

Published on May 24, 2014 9:44 AM IST

tamanna-bipasha-basu
అవును, మీరు విన్నది నిజమే. బాలీవుడ్ ముద్దుగుమ్మ బిపాషా బసు, మిల్కీ బ్యూటీ తమన్నాపై కోపంగా ఉందంట. తను ప్రస్తుతం చేస్తున్న హిందీ సినిమా ‘హమ్ శకల్స్’ చిత్ర యూనిట్ సభ్యులు అందరూ తనకన్నా తమన్నాకె ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయం బిపాషకు ఆగ్రహం తెప్పించిందట. సాజిద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బిపాషాతో పాటు తమన్నా మరియు ఇషా గుప్తాలు నటిస్తున్నారు. యూనిట్ సభ్యుల సమాచారం ప్రకారం, తమన్నాకి అధిక ప్రాధాన్యత ఇచ్చి, ఆమెను సినిమా ప్రమోషన్ కోసం ఎన్నుకున్నందుకు బిపాషా చాలా కోపంగా ఉందంటున్నారు.

తమన్నా నటించిన మొదటి సినిమా ‘హిమ్మత్ వాలా’లో ఆమెకు అనుకున్నంత గుర్తింపు రాకపోవడంతో దర్శకుడు సాజిద్ ఖాన్, ఈ సినిమాతో తమన్నాకు మంచి పేరు తెచ్చిపెట్టాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఏదైతేనేం, బాలీవుడ్ ముద్దుగుమ్మ బిపాషా మాత్రం తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ మరియు రితేష్ దేశముఖ్ లు హీరోలుగా నటిస్తున్నారు.

తాజా వార్తలు