తెర మీదకు మరో స్వాతంత్ర్య సమరయోధుడి జీవిత చరిత్ర !

Published on Oct 9, 2018 12:02 pm IST


భారత గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా జీవితం ఆధారంగా ఒక బయోపిక్ తెరకెక్కనుంది. ‘ఆరామ్’ చిత్ర దర్శకుడు గోపి నయనార్ ఈచిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఆయన రెండు ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలతో సంప్రదింఫులు జరుపుతున్నారని సమాచారం. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ పీరియాడిక్ చిత్రంలో నటించే నటీనటులను ఇంకా ప్రకటించాల్సి వుంది.

ఇక బిర్సా ముండా , ముండా అనే గిరిజన తెగ కు చెందినవారు. గిరిజన ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆయన తరువాత భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్రను పోషించారు. భారత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో వున్నా ఏకైక గిరిజన నాయకుడి ఫొటో కూడా ఆయనేదే కావడం విశేషం.

సంబంధిత సమాచారం :