బర్త్ డే రోజు బోల్డ్ పోస్టర్ తో వచ్చిన తెలుగు బ్యూటీ.

Published on Jul 3, 2020 9:17 am IST

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఓ చిన్న పాత్ర ద్వారా టాలీవుడ్ కి పరిచమైన తెలుగు అమ్మాయి తేజస్వి మాదివాడ. ఆ తరువాత ఐస్ క్రీమ్ అనే హారర్ రొమాంటిక్ డ్రామాలో బోల్డ్ రోల్ చేసింది. ఈ మూవీకి వర్మ దర్శకుడు కావడం విశేషం. అనేక సినిమాలలో ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసిన తేజస్వి, హీరోయిన్ గా మాత్రం సరైన బ్రేక్ అందుకోలేదు. బిగ్ బాస్ సీజన్ 2లో పార్టిసిపేట్ చేసి కొంత ఫేమ్ తెచ్చుకుంది.

కాగా నెక్స్ట్ ఈ అమ్మడు కమిట్మెంట్ అనే ఓ బోల్డ్ కంటెంట్ మూవీలో నటిస్తుంది. సినిమా పరిశ్రమలో హీరోయిన్స్ కి ఉండే ఇబ్బందులు, వేధింపులు మరియు మోసాలు వంటి విషయాలను ప్రస్దావిస్తూ తెరకెక్కుతున్న ఈ మూవీలో తేజస్వి రోల్ మరోమారు యూత్ కి కిక్ ఎక్కించడం ఖాయం అనిపిస్తుంది. నేడు తేజస్వి మాదివాడ పుట్టిన రోజు సంధర్భంగా ఆ మూవీ నుండి ఓ హాట్ పోస్టర్ విడుదల చేశారు. ఇక ఈ చిత్రానికి లక్ష్మీ కాంత్ చెన్నా దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :

More