వేల మందికి ఉచితంగా వైద్యం, సేవలు అందించిన మాదాల రవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు!

Published on Jul 28, 2021 8:00 am IST

ఎన్నో హిట్ చిత్రాలను అందించిన నటుడు, నిర్మాత అయిన కీర్తి శేషులు మాదాల రంగారావు గారి కుమారుడు అయిన మాదాల రవి నటుడు గా, వైద్యుడి గా ఎన్నో సేవలు అందించారు. కరోనా వైరస్ మహమ్మారి మొదలు నుండి ఇప్పటి వరకూ కూడా దాదాపు 15 వేల మందికి పైగా బాధితులకు వైద్యం ఉచితంగా అందించారు.

ప్రజా నటుడు గా, ప్రజా వైద్యుడు గా మాదాల రవి చాలా గుర్తింపు పొందారు. అయితే ఆయన పుట్టిన రోజు సందర్భంగా నేడు సినీ పరిశ్రమ కి చెందిన వారు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎర్ర మల్లెలు చిత్రం తో చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు తెర కి పరిచయం అయ్యారు. నేను సైతం అనే చిత్రం లో హీరో గా నటించి టాలివుడ్ లో గుర్తింపు పొందారు.

సంబంధిత సమాచారం :