బిగ్ బాస్ ఆపేయాలంటూ మినిస్టర్ కి లేఖరాసిన ఎమ్మెల్యే

బిగ్ బాస్ ఆపేయాలంటూ మినిస్టర్ కి లేఖరాసిన ఎమ్మెల్యే

Published on Oct 10, 2019 2:08 PM IST

దేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన రియాలిటీ షో గా బిగ్ బాస్ ఉంది. హిందీ తో పాటు, దేశంలోని అన్ని ప్రధాన భాషలలో బిగ్ బాస్ షో ప్రసారం అవుతుంది. దేశవ్యాప్తంగా ప్రసారం అయ్యే హిందీ బిగ్ బాస్ షో కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. జాతీయ భాషలో ప్రసారం కావడం ఒకెత్తయితే, దానికి సల్మాన్ లాంటి సూపర్ స్టార్ వ్యాఖ్యాతగా వ్యవహరించడంతో కోట్లలో ప్రేక్షకులు ఆ షోని వీక్షిస్తున్నారు. కాగా కొద్దిరోజుల క్రితం బిగ్ బాస్ 13వ సీజన్ ప్రారంభమైంది.

ఈ షోని ఆపివేయాలని ఘజియాబాద్ బీజేపీ ఎమ్మెల్యే నంద్ కిషోర్ గుజ్జర్ సమాచార మరియు ప్రసార శాఖామంత్రి ప్రకాష్ జవ్దేకర్ కి లేఖ రాయడం జరిగింది. షోలో సభ్యుల ప్రవర్తన కుటుంబ సభ్యులు కలిసి చూడలేనంత వల్గర్ గా ఉంటుందని, వారి ప్రవర్తన, డ్రెస్సింగ్, మరియు వివిధ వర్గాలకు చెందిన వారు ఒకే పడకగదిలో, ఒకే బెడ్ పై పడుకోవడం మన సంప్రదాయాలకు విరుద్ధం అని ఆయన లేఖలో రాశారు. అలాగే టీవీ ప్రసార కార్యక్రమాలపై సెన్సార్ సభ్యులు ద్రుష్టి సారించాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఆయన లేఖపై మంత్రి ఎలా స్పందిస్తారో, బిగ్ బాస్ పై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు