ఏంటీ “సీత” పైన కూడా ఆంక్షలా…?

Published on May 23, 2019 12:14 pm IST

బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ నటించిన “సీత” విడుదలకు సర్వమ్ సిద్ధమైంది. ఐతే ఇప్ప్డుడు ఈ మూవీ విడుదలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది ఓ హిందూ సంస్థ. ఈ చిత్రం లోని కొన్ని సన్నివేశాలు, మాటలు రామాయణ సీతాదేవి ని కించపరిచేలా ఉన్నాయని భారతీయ జనతా యువ మోర్చా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. వాటిని తొలగించడం లేక మార్పు చేయడం చేయాలనీ వారు డిమాండ్ చేస్తున్నారు.

పురాణాల నుండో లేక చరిత్రలో గొప్ప వ్యక్తుల పేర్లు వాడే సమయంలో లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. మరి ఈ విషయం పై దర్శకుడు తేజా ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :

More