ఈ కాంబోపై ఏ సమయంలో అయినా బ్లాస్టింగ్ అప్డేట్ రావొచ్చు.!

Published on May 1, 2021 9:00 am IST

ఇప్పుడు టాలీవుడ్ లో రిపీట్ కానున్న మరో సెన్సేషనల్ కాంబోపై ఓ రేంజ్ లో రచ్చ లేస్తుంది. అదే ఎవర్ గ్రీన్ కాంబోలలో ఒకటైన సూపర్ స్టార్ మహేష్ అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో. వీరి నుంచి వచ్చిన లాస్ట్ రెండు చిత్రాలు పెద్ద హిట్స్ కాకపోవచ్చు కానీ టాలీవుడ్ ఆడియెన్స్ లో అవి వేసుకున్న ముద్ర చేరగనిది. అందుకే హ్యాట్రిక్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే ఈ కాంబోపై ఈరోజే అప్డేట్ ఉందని సినీ వర్గాల నుంచి గట్టి టాక్. అయితే ఈ రోజు ఏ సమయంలో అయినా ఆ బ్లాస్టింగ్ అప్డేట్ ఉండొచ్చని తెలుస్తుంది. అప్పటి వరకు ఎదురు చూడాల్సిందే మరి. ఇప్పటికే మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా హ్యాష్ ట్యాగ్ ని ఇండియన్ ట్రెండ్స్ లో కూడా పెట్టేసారు. మరి ఈ మోస్ట్ అవైటెడ్ కాంబో హ్యాట్రిక్ సినిమా అప్డేట్ ఏ టైం కి వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :