ఎంఎస్.రాజు సినిమాకి బోల్డ్ టైటిల్

Published on Jan 3, 2020 7:21 pm IST

‘నువ్వొస్తానంటే నేనోద్దంటానా, ఒక్కడు, వాన, వర్షం, మనసంతా నువ్వే’ లాంటి హిట్ సినిమాల్ని నిర్మించిన నిర్మాత ఎం.ఎస్.రాజు దర్శకుడిగా మారుతున్న సంగతి తెలిసిందే. నిర్మాతగా అన్ని సాఫ్ట్ కథలని మాత్రమే చేసిన అయన దర్శకుడిగా మాత్రం బోల్డ్ కంటెంట్ ఎంచుకున్నారు. ఈ చిత్రం ప్రస్తుత యువతకు కనెక్టయ్యేలా ఉంటుందని అంటున్నారు.

పైగా సినిమాకు ‘డర్టీ హరి’ అనే టైటిల్ నిర్ణయించారు. టైటిల్ చూస్తే సినిమా కంటెంట్ రాజుగారి గత సినిమాలకంటే భిన్నంగా ఉంటుందని అనిపిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ రేపు ఉదయం 11:11 గంటలకి విడుదలకానుంది. గూడూరు సతీష బాబు, గూడూరు పునీత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :