వరుస విషాదాలు..మరో నటుడు మృతి.

Published on Jul 12, 2020 6:10 pm IST

బాలీవుడ్‌లో విషాదాల పరంపర కొనసాగుతుంది. బాలీవుడ్‌ కి చెందిన మరో నటుడు మృత్యువాత పడ్డాడు. బాలీవుడ్ లో బుల్లితెర నటుడిగా మంచి పేరున్న రంజన్‌ సెహగల్‌ కన్నుమూశారు. ఆయన వయసు కేవలం 36 సంవత్సరాలు మాత్రమే అని తెలుస్తుంది. చండీగఢ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రంజన్ సెహగల్ శనివారం రాత్రి మరణించారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శరీరంలోని పలు అవయవాలు పనిచేయకపోవడంతో రంజన్‌ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

బుల్లితెర నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రంజన్ 2016లో రణ్‌దీప్‌ హుడా, ఐశ్వర్యరాయ్‌‌ ప్రధాన పాత్రల్లో వచ్చిన సరబజిత్ ‌లో నటించారు. ఫోర్స్‌, కర్మ వంటి చిత్రాలతో పాటు, పలు పంజాబీ సినిమాల్లోనూ ఆయన నటించారు. క్రైమ్‌ పెట్రోల్‌ టీవీ సిరీస్‌లో కనిపించారు. ఇదే ఏడాదిలో బాలీవుడ్‌కు చెందిన నటులు రిషికపూర్‌, ఇర్ఫాన్‌ ఖాన్‌, సరోజ్‌ ఖాన్‌, వాజీద్‌ ఖాన్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. రాజ్‌పూత్‌ ఆత్మహత్య చేసుకున్నారు.

సంబంధిత సమాచారం :

More