‘ఆర్ఆర్ఆర్’లో ఆ హీరోయిన్ నటించట్లేదట !

‘ఆర్ఆర్ఆర్’లో ఆ హీరోయిన్ నటించట్లేదట !

Published on Apr 22, 2019 11:00 PM IST

ఎన్టీఆర్ – చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ రామ్ చరణ్ కు గాయం అవ్వడం కారణంగా మూడు వారాల పాటు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించాల్సిన హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గార్ జోన్స్ కొన్ని పర్సనల్ ప్రొబ్లెమ్స్ వల్ల ఈ సినిమా నుండి తప్పుకున్న విషయం కూడా తెలిసిందే. అయితే ఎన్టీఆర్ సరసన డైసీ ఎడ్గార్ జోన్స్ స్థానంలో శ్రద్దా కపూర్ నటిస్తోందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

కానీ సినీ వర్గాల సమాచారం ప్రకారం శ్రద్దా కపూర్ ‘ఆర్ఆర్ఆర్’లో నటించట్లేదట. గతంలో ఒప్పుకున్న సినిమా కారణంగా ఆమె ప్రస్తుతం చాలా బిజీగా ఉందట. దాంతో ‘ఆర్ఆర్ఆర్’లో నటించట్లేదని తెలుస్తోంది. మొత్తానికి ఎన్టీఆర్ కోసం హీరోయిన్ని వెతికే పని రాజమౌళి ఇంకా పూర్తి కాలేదన్నమాటే. ఇక ఇప్పటికే ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ ‘ఆర్ఆర్ఆర్’లో ఓ ఫ్రీడమ్ ఫైటర్ పాత్రలో నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు