బన్నీ మూవీ సూపర్ అంటున్న బాలీవుడ్ డైరెక్టర్

Published on Jul 12, 2020 11:41 pm IST

బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ గుప్తా బన్నీ లేటెస్ట్ సెన్సేషన్ అల వైకుంఠపురంలో మూవీపై ప్రశంసలు కురిపించారు. అలా వైకుంఠపురంలో మూవీ చాలా గొప్పగా ఉందని పొగడ్తలతో ముంచెత్తారు. ఇప్పుడే నెట్ ఫ్లిక్స్ లో అల వైకుంఠపురంలో మూవీ చూశాను…అద్భుతమైన ఎంటర్టైనర్. బిగ్ స్క్రీన్ పై ఈ చిత్రాన్ని చూడకపోవడం అనేది బాధాకర విషయం. ఈ లాక్ డౌన్ లో మంచి ఉపశమనం అవుతుంది, వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని చూడండి అని ట్వీట్ చేశారు.

ఇక దర్శకుడు సంజయ్ గుప్తా ప్రశంసాపూర్వక ట్వీట్ కి అల్లు అర్జున్ స్పందించారు. మా చిత్రాన్ని అభినందించి నందుకు ధన్యవాదులు అని తెలిపారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో సంక్రాంతి బ్లాక్ కానుకగా వచ్చిన అల వైకుంఠపురంలో భారీ విజయాన్ని అందుకుంది. బన్నీ కెరీర్ బెస్ట్ వసూళ్లు సాధించిన ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటించింది.

సంబంధిత సమాచారం :

More