బాలకృష్ణ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ !
Published on Mar 13, 2018 10:46 am IST

తేజ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తోన్న సినిమా ‘ఎన్టీఆర్’. సీనియర్ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ సినిమా మార్చి 29 న ప్రారంభంకానుంది. కీరవాణి సంగీతం అందించబోతున్న ఈ మూవీని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంభందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె సీనియర్ ఎన్టీఆర్ భార్య బసవతారకంగారి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇటీవలే డైరెక్టర్ తేజ విద్యా బాలన్ ను కలవడం, కథ చెప్పడం, అందుకు ఆమె అంగీకరించడం జరిగిపోయాయని వినికిడి. ఈ సినిమా ప్రారంభం రోజున చిత్రంలో నటించే ఇతర నటీనటుల పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

 
Like us on Facebook