‘సైరా’కి సంగీత దర్శకుడు సెట్టయ్యాడు !

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. మొదట్లో ఈ చిత్రానికిఒ ఆస్కార్ విజేత ఏఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తారని ప్రకటించగా బిజీ షెడ్యూల్ వలన ఆయన ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత కీరవాణి, తమన్ లాంటి సంగీత దర్శకుల పేర్లు కూడ వినిపించాయి.

కానీ చివరికి బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేదిని ప్రాజెక్టులోకి తీసుకుకోవాలని మెగా కాంపౌండ్ నిర్ణయించిందట. అమిత్ త్రివేది గతంలో ‘దేవ్ డి, క్వీన్, ఉడ్తా పంజాబ్, డియర్ జిందగీ’ వంటి సినిమాలకి మంచి సంగీతాన్ని అందించారు. రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తుండగా అమితాబ్, నయనతార, విజసేతుపతి వంటి స్టార్లు ఈ సినిమాలో పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.