భారీ ధరకు అలవైకుంఠపురంలో హిందీ రీమేక్ రైట్స్..!

Published on Apr 6, 2020 8:06 am IST

దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తరువాత బన్నీ అల వైకుంఠపురంలో మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ అందుకుంది. బన్నీ-త్రివిక్రమ్ ల ఈ హ్యాట్రిక్ మూవీ టాలీవుడ్ లో టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. బన్నీ యాక్షన్, పూజ గ్లామర్, త్రివిక్రమ్ టేకింగ్ ముఖ్యంగా థమన్ సాంగ్స్ అన్ని వెరసి ఓ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కుదిరింది.

కాగా ఈ మూవీ హిందీ రీమేక్ హక్కులను ఓ హిందీ నిర్మాత భారీ ధర చెల్లింది దక్కించుకున్నారట. అనేక మంది నిర్మాతలు ఈ చిత్ర హిందీ రైట్స్ కొరకు పోటీపడగా ప్రొడ్యూసర్ అశ్విన్ వార్డె ఫ్యాన్సీ ధర చెల్లింది, దక్కిచుకున్నాడని సమాచారం. అశ్విన్ గత ఏడాది షాహిద్ కపూర్ తో అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ తెరకెక్కించగా భారీ విజయం అందుకుంది. ఇక ఈ హిందీ రీమేక్ బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ లేదా షాహిద్ కపూర్ తో చేయాలని భావిస్తున్నాడట.

సంబంధిత సమాచారం :

X
More