మన్మధుడు చిత్రం తో అందరికీ ఫేవరేట్ హీరోయిన్ గా మారిపోయారు అన్షు. ఈ చిత్రం తెలుగు సినీ అభిమానులకు ఎంతో ఫేవరేట్. ఇటీవల ఈ చిత్రం ను రీ రిలీజ్ చేయగా, సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అన్షు ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన రాఘవేంద్ర చిత్రం లో కూడా హీరోయిన్ గా నటించింది. అయితే ఈ హీరోయిన్ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోయినట్లు తెలుస్తోంది.
సందీప్ కిషన్ హీరోగా, డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన డైరెక్షన్ లో తెరకెక్కుతున్న SK30 చిత్రం లో ఒక కీలక పాత్ర కోసం అన్షు ను తీసుకోనున్నట్లు లేటెస్ట్ సమాచారం. తన పాత్రకి సంబందించిన నేరేషన్ పూర్తి అయ్యింది అని, అన్నీ కుదిరితే ఈ చిత్రం తో రీ ఎంట్రీ కన్ఫర్మ్ అని చెప్పాలి. ఈ చిత్రం లో హీరోయిన్ ఎవరనే దానిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సందీప్ కిషన్ టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఊరు పేరు భైరవకోన చిత్రం లో చివరిసారిగా కనిపించారు. ఈ చిత్రం ప్రేక్షకులని అలరించింది.