‘రామ్ చరణ్’ సినిమాలో బాలీవుడ్ స్టార్ ?

Published on Aug 1, 2021 8:13 pm IST

మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ – విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమాలో మొత్తానికి కియారా అద్వానీని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. అయితే, భారీ బడ్జెట్ రాబోతున్న ఈ భారీ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ హీరో కూడా నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో 20 నిమిషాల నిడివి కలిగిన ఓ పవర్ ఫుల్ పాత్ర ఉందట.

పక్కా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న ఈ సినిమాలో ఆ కీలక పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తే బాగుంటుందని డైరెక్టర్ శంకర్ ఫీల్ అవుతున్నాడు. ఎలాగూ అక్షయ్ కుమార్, ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో నటించాడు, అలాగే శంకర్ తో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది కాబట్టి.. అక్షయ్ కూడా ఈ పాత్ర చేయడానికి అంగీకరించే అవకాశం ఉంది. ఇక తమిళంలో ఈ పాత్ర కోసం విజయ్ సేతుపతిని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట.

ఇక సహజంగానే తన సినిమాల్లో హీరోల్ని డిఫరెంట్ గెటప్స్ అండ్ మేకప్స్ తో చూపించే ఆనవాయితీ ఉన్న శంకర్, ఈ భారీ సినిమాలో రామ్ చరణ్ ను కూడా చాల వినూత్నంగా చూపించబోతున్నాడట.

సంబంధిత సమాచారం :