మహేష్ బాబు ఫాదర్ గా బాలీవుడ్ స్టార్ ?

మహేష్ బాబు ఫాదర్ గా బాలీవుడ్ స్టార్ ?

Published on May 4, 2021 12:01 AM IST


మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న క్రేజీ సినిమా పై ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ నటించబోతున్నాడట. మహేష్ ఫాదర్ గా అనిల్ కపూర్ నటిస్తాడట. ఇక అనిల్ కపూర్ కోసం త్రివిక్రమ్ ఓ కీలక పాత్రను రాశాడని.. అది పక్కా డాన్ పాత్ర అని తెలుస్తోంది. ఇక మహేష్ బాబు పాత్ర కూడా డాన్ పాత్రకు ముడిపడి ఉంటుందట. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లు.. అందులో ఒక హీరోయిన్ గా కియారా అద్వానీను తీసుకోవాలనుకుంటున్నారట.

కాగా త్రివిక్రమ్ సినిమా అంటేనే భారీ తనం ఉంటుంది. పైగా వరుసగా ఫుల్ సక్సెస్ లో ఉన్నాడు. అందుకే చిన్న పాత్రల్లో కూడా పెద్ద నటీనటులనే తీసుకుంటున్నాడు. ఈ సినిమాని హారికా హాసిని క్రియేషన్స్ నిర్మించిబోతుంది. ఇక పదకుండు సంవత్సరాల తరువాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాల తరువాత త్రివిక్రమ్ చేస్తోన్న సినిమా కాబట్టి, ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు