స్టార్ ప్రొడ్యూసర్ కూతురికి కరోనా.

Published on Apr 6, 2020 1:51 pm IST

కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. రోజుకు వేలల్లో దీని బారినపడి ప్రజలు మరణిస్తున్నారు. ప్రముఖులు, ప్రధానులు, స్టార్స్ అనే తేడాలేకుండా అందరికీ ఈ మహమ్మారి అంటుకుంటుంది. దీన్ని నియంత్రించ లేక ప్రపంచ దేశాలు జుట్టుపీక్కుంటున్నాయి. బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కరోనా వైరస్ బారినపడి కోలుకోగా మరో బాలీవుడ్ సెలెబ్రిటీ కూతురు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరీం మొరాని కుమార్తె షాజా మొరాని కూడా ఈ ప్రాణాంతక కరోనా బారినపడినట్టు తెలుస్తుంది.కరీమ్ మొరానీ షారుక్ నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ మూవీ నిర్మాత. షాజా మొరాని ఇటీవలే ఆస్ట్రేలియా నుంచి ముంబైకి వచ్చారు. రెండు రోజులుగా జ్వరం దగ్గు, జలుబుతో బాధపడుతున్న ఆమెకు వైద్య పరీక్షలు చేయగా కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. షాజా మొరాని కొన్నేళ్లుగా ప్రియాంక్ శర్మతో డేటింగ్ కొనసాగిస్తోంది. ప్రియాంక్ శర్మతో కలిసి ఆస్ట్రేలియాలో పర్యటించి షాజా వచ్చారని సమాచారం. ఇప్పుడు షాజాకు కరోనా అని తెలియడంతో ఆమె ప్రియుడు ప్రియాంక్ కు కూడా కరోనా టెస్టులు చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు.

సంబంధిత సమాచారం :

X
More