ఘనంగా ప్రారంభమైన అభినవ్ మణికంఠ ‘బొమ్మ హిట్’

ఘనంగా ప్రారంభమైన అభినవ్ మణికంఠ ‘బొమ్మ హిట్’

Published on Dec 20, 2025 8:00 AM IST

Bomma

చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు విజయవంతమైన చిత్రాల్లో అలరించిన అభినవ్ మణికంఠ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “బొమ్మ హిట్”. అంజనీపుత్ర ఫిలింస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా గుర్రాల సంధ్యారాణి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజేష్ గడ్డం ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పూజా యడం కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం హైదరాబాద్‌లో గురువారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.

వినోదమే ప్రధానంగా సాగే సిచ్యువేషనల్ కామెడీ చిత్రమిదని, ఇందులో మంచి ఎమోషన్ కూడా ఉంటుందని హీరో అభినవ్ తెలిపారు. దర్శకుడు రాజేష్ మాట్లాడుతూ.. ప్రముఖ నటీనటులతో, బలమైన కథాకథనాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, వచ్చే వేసవికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నారు. కథపై ఉన్న నమ్మకంతోనే తమ బ్యానర్‌లో తొలి ప్రయత్నంగా ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు నిర్మాత సంధ్యారాణి తెలిపారు.

ప్రారంభోత్సవంలో పాల్గొన్న నటుడు హైపర్ ఆది మాట్లాడుతూ.. “టైటిల్‌లోనే ‘బొమ్మ హిట్’ అని పాజిటివ్‌గా పెట్టారు, సినిమా కచ్చితంగా విజయం సాధించాలి” అని ఆకాంక్షించారు. ఈ చిత్రంలో తాను హీరో తండ్రి పాత్రలో కనిపిస్తున్నట్లు నటుడు మురళీధర్ గౌడ్ తెలిపారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై యూనిట్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు