‘మైదాన్’ టీమ్ కి ముప్పై కోట్లు నష్టమట !

Published on May 23, 2021 9:00 pm IST

కరోనా మహమ్మారితో పాటు నిన్న వచ్చిన తుఫాన్‌ కూడా సినీ పరిశ్రమకు భారీ నష్టాన్ని మిగిల్చింది. ముంబైలోని పలు ప్రాంతాలు తుఫాన్ కారణంగా బాలీవుడ్‌ కు చెందిన భారీ సినిమాల పెద్ద సెట్టింగ్స్ ఒక్కసారిగా కూలిపోయాయి. ఈ క్రమంలో ‘మైదాన్’ అనే సినిమా కోసం ఎంతో కష్టపడి భారీ సెట్ ను నిర్మించారు. తుఫాన్ దాటికి ఈ సెట్ కొట్టుకుపోయింది. సుమారు రూ.30 కోట్ల న‌ష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది .

ఈ విషయాన్ని బోనికపూర్ మాట్లాడుతూ..‘ భారీ సెట్ నిర్మించాం. అయితే ప్రస్తుత తౌటే తుఫాన్ ధాటికి సెట్ అంతా కూలిపోయి రాకుండా పోయింది. దాదాపు రూ.30 కోట్ల నష్టం వాటిల్లిందని లెక్కలు చెబుతున్నాయి’ అంటూ బోనికపూర్ తన బాధను చెప్పుకున్నాడు. అజయ్ దేవగణ్ హీరోగా బోనికపూర్ నిర్మిస్తున్న ఈ మైదాన్ చిత్రం పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సెట్ వేయడానికి దాదాపు నాలుగు నెలలు కష్టపడ్డారని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :