ఆ ఓటిటి లో రిలీజ్ కానున్న విశ్వక్సేన్, రకుల్ ప్రీత్ మరియు నివేత నటించిన ‘బూ’

Published on May 23, 2023 11:16 pm IST


విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్, మంజిమా మోహన్, మెగాహ ఆకాష్, నివేతా పేతురాజ్, రెబా మోనికా జాన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ థ్రిల్లింగ్ హర్రర్ జానర్ మూవీ బూ. ఈ రోజు మధ్యాహ్నం ఈ మూవీ టీజర్ విడుదలైంది. రకుల్ తోపాటు తన స్నేహితులకు హాలోవీన్ స్టోరీస్ అనే పుస్తకం గురించి వివరించడంతో టీజర్ ప్రారంభమవుతుంది, ఇందులో దెయ్యం కథలు ఉంటాయి. అప్పుడు ఒక పాత్ర నివేదా పేతురాజ్‌ని ఎక్కిళ్లు వస్తున్నాయా అని అడుగడం అనంతరం అకస్మాత్తుగా అందరు స్త్రీ పాత్రలకు ఎక్కిళ్ళు రావడం ప్రారంభమవుతాయి.

ఈ విధంగా హర్రర్ మరియు థ్రిల్లింగ్ అంశాలతో టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడం తోపాటు సినిమాపై మంచి క్యూరియాసిటీ ఏర్పరిచింది. కాగా ఈ శనివారం అనగా మే 27 న ప్రముఖ ఓటిటి మాధ్యమం జియో సినిమాలో డైరెక్ట్ గా బూ విడుదల కానున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని జ్యోతి దేశ్‌పాండే, రామాంజనేయులు జవ్వాజి మరియు ఎం. రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా మే 27 నుంచి తెలుగు, తమిళ భాషల్లో ప్రసారం కానుంది.

సంబంధిత సమాచారం :