కింగ్ నాగార్జున , అఖిల్ ని మాస్ ప్రేక్షకులకు దగ్గర చేయాలని ఎప్పటినుండో ప్రయత్నాలు చేస్తున్నాడు. దాంట్లో భాగంగా మాస్ ఇమేజ్ తీసుకురావడంలో దిట్టయినా బోయపాటి శ్రీను ను అఖిల్ తో సినిమా చేయాలని పలుమార్లు కోరాడట నాగ్. దాంతో బోయాపాటి అఖిల్ నాల్గవ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తల ఫై స్పందించారు బోయపాటి. ప్రస్తుతం నా దృష్టంతా రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ పైనే వుంది. ఈచిత్రం తరువాత బాలకృష్ణ తో సినిమా చేయనున్నాని అఖిల్ తో సినిమా చేయనున్నాని వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.
ఇక అఖిల్ ప్రస్తుతం ‘మిస్టర్ మజ్ను’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ లో వున్న ఈ చిత్రం జనవరి 25న విడుదలకానుందని సమాచారం. ఈచిత్రాన్ని పూర్తి చేసిన తరువాత అఖిల్ తన కొత్త చిత్రాన్ని ప్రకటించనున్నాడు.


