బాలయ్య హీరోయిన్ పై క్లారిటీ ఇచ్చిన బోయపాటి.

Published on Jul 7, 2020 9:23 am IST

బాలయ్య- బోయపాటి సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై కొద్దిరోజులుగా పెద్ద చర్చ నడుస్తుంది. ఈ మూవీలో హీరోయిన్ గా అమలా పాల్ ఖరారు అయ్యారని జోరుగా ప్రచారం సాగుతుంది. ఐతే ఈ విషయంపై దర్శకుడు బోయపాటి క్లారిటీ ఇచ్చారు. బాలయ్య హీరోయిన్ కోసం బోయపాటి రెండు ఆలోచనలు చేశాడట. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్ తీసుకుందామా? లేదా కొత్త హీరోయిన్ ని తీసుకుందామా? అని. చివరకు కొత్త హీరోయిన్ ని తీసుకోవాలని బోయపాటి ఫిక్స్ అయ్యారట.

దీనితో బాలయ్య సినిమా ద్వారా ఓ కొత్త ఫేస్ పరిశ్రమకు పరిచయం కాబోతుందని అర్థం అవుతుంది. ఇక అమలా పాల్ నటిస్తుందన్న వార్తలో కూడా నిజం లేదని తేలిపోయింది. మరి బాలయ్య పక్కన ఛాన్స్ కొట్టేసే ఆ లక్కీ హీరోయిన్ ఎవరనేది ఆసక్తిగా మారింది. ఇక ఈ చిత్రాన్ని మిర్యాల రవీంద్రా రెడ్డి నిర్మిస్తుండగా…తమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More