బాలయ్య హీరోయిన్ బాలీవుడ్ నుండేనా?

Published on Jul 11, 2020 2:05 am IST


ఇటీవల దర్శకుడు బోయపాటి బాలయ్య హీరోయిన్ పై క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ హీరోయిన్ విషయంలో అనేక పుకార్లు నడుస్తున్న నేపథ్యంలో ఆయన వాటికి చెక్ పెట్టారు. దీనితో పాటు ఓ డెబ్యూ హీరోయిన్ ని ఈ చిత్రం కోసం తీసుకుంటున్నట్లు చెప్పడం జరిగింది. బాలయ్యకు జంటగా కొత్త మొహాన్ని పరిచయం చేస్తాను అన్న బోయపాటి బాలీవుడ్ నుండే ఆ అమ్ముడుని దించనున్నారట. బాలయ్యకు సరిపోయే ఓ టాప్ మోడల్ ని ఈ చిత్రంతో బోయపాటి పరిచయం చేయనున్నారన్న వార్త గట్టిగా వినిపిస్తుంది.

మోడల్స్ ని హీరోయిన్స్ గా పరిచయం చేసే సంప్రదాయం టాలీవుడ్ కి ఎప్పటి నుండో ఉండగా, బాలయ్యతో బోణి చేయనున్న ఆ లక్కీ లేడీ ఎవరో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని బోయపాటి భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. మిర్యాల రవీంద్రా రెడ్డి నిర్మాతగా ఉండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. సూపర్ మాన్, మోనార్క్ అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

More