బోయపాటి ‘బాలయ్య’ చెప్పినట్లే చేసుకుపోతున్నాడు !

Published on May 14, 2019 3:30 am IST

మొత్తానికి నందమూరి బాలకృష్ణ సూచన మేరకు బోయపాటి శ్రీను స్క్రిప్ట్ పనులను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. వీరి కాంబినేషన్ లో జూన్ నుండి మొదలవ్వాల్సిన సినిమా హై బడ్జెట్ కారణంగా పోస్ట్ ఫోన్ అయిన విషయం తెలిసిందే. మొదట ఈ సినిమాకు బోయపాటి ఇచ్చిన బడ్జెట్ దాదాపు 60 కోట్లు. బడ్జెట్ మరి ఎక్కువ అయితే రిస్క్ అనే ఉద్దేశ్యంతో.. ఈ కథ పక్కన పెట్టి, 40 కోట్లల్లో వేరే కథ ఏదైనా చెయ్యమని బాలయ్య బోయపాటికి సూచించారట.

కాగా బాలయ్య సూచన మేరకు బోయపాటి కథ మార్చకుండా కథలో మార్పులు చేసి.. మొత్తానికి ‘బాలయ్య’ చెప్పినట్లే బడ్జెక్ట్ తగ్గే విధంగా స్క్రిప్ట్ లో మార్పులు చేశాడు. స్క్రిప్ట్ లో చేసిన మార్పులు గురించి ఇప్పటికే బాలయ్యకి కూడా వినిపించినట్లు తెలుస్తోంది. బాలయ్యకి కూడా లేటెస్ట్ వర్షన్ బాగా నచ్చిందట. ముఖ్యంగా సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపిస్తారని.. అందులో ఒక పాత్ర కొంత వైవిధ్యంగా ఉంటుందని సమాచారం.

ఇక అక్టోబర్ నుండి ఈ సినిమా మొదలుపెట్టాలని బోయపాటి భావిస్తున్నారు. మరి బాలయ్య – బోయపాటి కాంబినేషన్ ఈ సారి హిట్ అవుతుందో లేదో చూడాలి. హిట్ అయితే మాత్రం బాలయ్య – బోయపాటి హ్యాట్రిక్ హిట్ కొట్టినట్లే.

సంబంధిత సమాచారం :

More