‘బన్నీ’ ప్లేస్ లో ‘నిఖిల్ గౌడ’.. నిజమేనా ?

Published on Jul 30, 2019 4:47 pm IST

‘వినయ విధేయరామ’ ప్లాప్ ఎఫెక్ట్ బోయపాటి పై బాగానే పడింది. ఎప్పుడూ వరుస ఆఫర్స్ తో బిజీ బిజీగా ఉండే బోయపాటి, ఆ సినిమా ప్లాప్ వల్ల చాలా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే చాలా కాలంగా బోయపాటి తరువాత సినిమా పై చాలా వార్తలు వచ్చాయి. వాటిల్లో ఇటీవలే బాగా వైరల్ అయిన న్యూస్.. బోయపాటి – నిఖిల్ గౌడ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందనే విషయం.

జాగ్వర్ చిత్రంతో టాలీవుడ్ అండ్ శాండిల్ వుడ్‌ లలో భారీ ఎంట్రీ ఇచ్చాడు నిఖిల్ గౌడ. అయితే నిఖిల్ గౌడకి మాత్రం సరైన సక్సెస్ రాలేదు. అందుకే బోయపాటితో సినిమా చెయ్యాలని నిఖిల్ వర్గం ఎప్పటినుండో ప్లాన్ చేస్తున్నారట. ఎలాగూ కన్నడ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ గౌడ, తెలుగులో కూడా అలాంటి గుర్తింపు కోసం బోయపాటితో సినిమా చెయ్యబోతున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్‌ కి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

మరో వైపు బోయపాటి – అల్లు అర్జున్ కాంబినేషన్ లో అల్లు అరవింద్ నిర్మాణంలో ఓ సినిమా రాబోతుందని.. పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ సినిమా నవంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్ళబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ‘బన్నీ’ ప్లేస్ లో ‘నిఖిల్ గౌడ’ వస్తాడో.. లేక బన్నీతోనే బోయపాటి సినిమా చేస్తాడో చూడలి.

సంబంధిత సమాచారం :