బన్నీ కోసం స్క్రిప్ట్ రెడీ చేసిన యాక్షన్ డైరెక్టర్ ?

Published on Oct 25, 2021 8:00 am IST

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలయ్యతో ‘అఖండ’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. దాంతో బోయపాటి టేకింగ్ పై మళ్ళీ ప్రేక్షకుల్లో ఆసక్తి బాగా పెరిగింది. అందుకే బోయపాటి తర్వాత సినిమా పై అప్పుడే క్లారిటీ వచ్చింది. తన తరువాత సినిమాని బోయపాటి బన్నీతో ప్లాన్ చేస్తున్నాడు. పైగా ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మించనున్నాడు. తన బేనర్ లో బోయపాటి శ్రీను తన తర్వాత సినిమా చేయబోతున్నాడని ఓ స్టేజ్ మీద అల్లు అరవింద్ చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా బన్నీ కోసం ఓ స్క్రిప్టును కూడా బోయపాటి సిద్ధం చేశాడు. ఈ సినిమా పక్కా యాక్షన్ తో సాగే కామెడీ ఎంటర్‌టైనర్‌ గా ఉండనుందని.. ముఖ్యంగా బన్నీకి సరిపడే స్టోరీతో బోయపాటి ఈ సినిమాని ప్లాన్ చేశాడట. ఆల్ రెడీ సరైనోడు అనే సూపర్ హిట్ సినిమా వీరి ఖాతాలో ఉంది కాబట్టి .. వీరిద్దరి కాంబినేషన్ పెద్దగా ఆటంకం ఉండకపోవచ్చు. ఏది ఏమైనా హీరో ఎవరైనా తన సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ ను పక్కాగా ప్లాన్ చేసి హిట్ కొట్టడంలో బోయపాటికి మంచి అనుభవం ఉంది.

సంబంధిత సమాచారం :

More